ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి | - | Sakshi
Sakshi News home page

ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి

Mar 1 2026 7:29 AM | Updated on Mar 1 2026 7:29 AM

ఒడియా

ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి

పర్లాకిమిడి: ఒడియా భాష ఉన్నతి, ఒడిశా భాషా రాష్ట్రంగా ఏర్పాటుకు కృషిచేసిన పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్‌, ఇతర భాషాప్రజ్ఞులపై రాష్ట్ర స్థాయి ఇష్టాగోష్టి స్థానిక కలెక్టరేట్‌ వద్ద గ్రామీణ స్వయం ఉపాధి కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం జరిగినది. ఈ సభలో ఒడిశా మాతృభాష, యువపీడి’ అంశంపై పలువురు వక్తలు మాట్లాడారు. ఈ సభకు మహిళా డిగ్రీ కళాశాల అధ్యక్షురాలు డాక్టర్‌ రీనా సాహు అధ్యక్షత వహించారు. విశ్రాంత ప్రొఫెసర్‌ డాక్టర్‌ భారతీ పాణిగ్రాహి స్వాగత ఉపన్యాసం, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇష్టాగోష్టిలో సాహితీ విమర్శకులు డాక్టర్‌ లంబోధర పాణిగ్రాహి (బరంపురం), డాక్టర్‌ అశోక్‌ పండా, రాయగడ జిల్లా స్వయంప్రతిపత్తి కళాశాల అధ్యాపకురాలు రాజ్యలక్ష్మీదేవి, సరిహద్దు ప్రహరి పూర్ణచంద్ర మహాపాత్రో, శ్రీకాకుళం జిల్లా బారువ ప్రభుత్వ కళాశాల ఒడియా అధ్యాపకులు డాక్టర్‌ రామారావు మఝి తదితరులు పాల్గొన్నారు. మాతృభాష ద్వారా వ్యక్తిత్వ వికాసం జరుగుతుందని, స్వాతంత్య్రంకు పూర్వం పర్లాకిమిడి, జయపురం, నవరంగ్‌పూర్‌, రాయగడ, గంజాంలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవని, తరువాత బెంగాల్‌లో కోన్ని జిల్లాలు కలిసిన తర్వాత బెంగాళీ

భాషలో అనేకమంది కవులు పుస్తకాలు రాశేవారని లంబోధర పాణిగ్రాహి అన్నారు. తదుపరి కాలంలో సరిహద్దు ఆంధ్రప్రదేశ్‌ తెలుగు భాష ప్రభావం కూడా పర్లాకిమిడి సంస్థానంపై పడి ఒడిశా భాష వైభవం కోల్పోయిందని ఉత్కళ హితేషిణి కార్యదర్శి పూర్ణచంద్ర మహాపాత్రో ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఒడియా భాషలో వక్తృత్వం, ప్రబంధాలు, శుద్ధ ఒడియా రాయడంపై మహిళా కళాశాల నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు లంబోధర పాణిగ్రాహి బహుమతులు ప్రదానం చేశారు. అధ్యాపకురాలు బరదా ఆచార్య సభకు ధన్యవాదాలు తెలిపారు.

ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి1
1/4

ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి

ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి2
2/4

ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి

ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి3
3/4

ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి

ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి4
4/4

ఒడియా భాషా వైభవంపై ఇష్టాగోష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement