జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి రామగిరి ప్రాంతంలో ముగ్గురు గంజాయి మాఫియా వ్యక్తులను వెండిస్తున్న సమయంలో ఇద్దరు పోలీసులు ప్రమాదానికి గురయ్యారు. గాయపడిన పోలీసులను వెంటనే బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. నేడు జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రామగిరి పోలీసు స్టేషన్‌కు కొంత దూరంలో ముగ్గురు మాఫియా వ్యక్తులు ఒక బైక్‌పై వెళ్తున్న సమాచారం అందడంతో.. రామగిరి పోలీసు పంటి పోలీసులు బైక్‌లపై వారిని పట్టుకునేందుకు వెంబడించారు. రామగిరి పోలీసు పంటి ఏఎస్‌ఐ బిష్ణ్రు మడకామి, పోలీసు డ్రైవర్ డొంబురు చలాన్‌లు బైక్‌పై వారిని వెంబడించారు. పోలీసు పంటికి 11 కిలోమీటర్ల దూరంలో గల ధల్‌పూర్ నర్సరీ సమీపంలో పోలీసులు వెళ్తున్న బైక్ అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో ఇద్దరు కింద పడగా తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానిక ప్రజలు బొయిపరిగుడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు పోలీసులను అంబులెన్స్‌లో బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి చేర్చారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కొరాపుట్ సహద్ లక్ష్మణ నాయిక్ వైద్య కళాశాల మెడికల్‌కు తరలించారు.


