ప్రయాణికులకు అవగాహన
రాయగడ: రైళ్లలో ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆర్‌పీఎఫ్ సిబ్బంది సూచించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు స్థానిక రైల్వే స్టేషభ్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్‌పీఎఫ్ అధికారి కె.ఎస్.వి.ఎన్.ఎస్.అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. టెక్కట్ లేని ప్రయాణం చేయడం చట్టవిరుద్ధమన్నారు. అదేవిధంగా ఎటువంటి అనుమతుల్లేని వారి నుంచి రైల్వే టిక్కెట్లను కొనుగోలు చేసి ప్రయాణ సమయంలో ఇక్కట్లకు గురికావద్దని వివరించారు. అలాగే ప్రయాణ సమయంలో తోటి ప్రయాణికులకు ఇబ్బందులు గురిచేసే విధంగా వ్యవహరించ కూడదని అన్నారు. రైల్వే ట్రాక్‌లను అనధికారంగా దాటడం, రైల్వే ఆస్తులు ధ్వంసం చేయడం వంటివి చట్టవిరుద్ధమని వివరించారు.


