మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలుకు కాంగ్రెస్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలుకు కాంగ్రెస్‌ ర్యాలీ

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

కొరాపుట్‌: మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ కాగాడాల ప్రదర్శన చేసింది. కొరాపుట్‌ జిల్లా లక్ష్మీపూర్‌లో మహిళా కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన ఎంఎల్‌ఏ పవిత్ర శాంత పాల్గొన్నారు. మరో వైపు నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలులో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఎద్దేశా చేశారు. ఆందోళనలో డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్‌ లిఫికా మజ్జి, నాయకులు మున్నా త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement