ఎలుగుబంటిని బంధించిన అటవీ సిబ్బంది | - | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటిని బంధించిన అటవీ సిబ్బంది

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

కొరాపుట్‌: అటవీ శాఖ సిబ్బంది ఎలుగు బంటిని బంధించారు. సోమవారం నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రం నుంచి దెవులా–కొసాగుమ్డ మార్గంలో ఎలుగుబంటి సంచిరిస్తుండదాన్ని స్థానికులు గమనించారు. జన సంచారం ప్రాంతంలో ఎలుగు సంచరిస్తుండంతో భయాందోళన చెందారు. వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎండ వేడిమితో ఎలుగు బంటి ప్రధానమార్గంలో కల్వర్టు కింద సేద తీరుతుంది. ఇదే సమయంలో అటవీసిబ్బంది కల్వర్టుకి ఒక వైపు బోను పెట్టి మరో వైపు మూసి వేశారు. దాంతో ఎలుగు బోను లోనికి వెళ్లి చిక్కుకుంది. వెంటనే దానిని నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షలు అనంతరం సురక్షితంగా అడవిలో విడిచి పెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement