పర్లాకిమిడి: కాశీనగర్ బ్లాక్ కె.సీతాపురం పంచాయతీ సింగుపురం గ్రామం సమీపంలో ఒక రోడ్డు దుర్ఘటనలో పడి ఉన్న క్షతగాత్రునికి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి తన కారును ఆపి సాయం చేశారు. గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్ ఖండవ గ్రామానికి ఒక ప్రారంభోత్సవానికి పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి వెళుతుండగా ఈ సంఘటన గురువారం జరిగింది. సింగిపురం గ్రామ సమీపంలో స్టేట్ హైవే వద్ద ఒక మోటారు సైకిల్ పర్లాకిమిడి నుండి వస్తున్న కారును ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు తీవ్రగాయాలతో రోడ్డు పక్కన పడి ఉండటం చూసి తాగునీటిని అందజేశారు. అలాగే వెంటనే అంబులెన్స్ 108కి ఫోన్ చేసి పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం పంపించారు. కె.సీతాపురం పంచాయతీ సర్పంచ్ తేజేశ్వరరావు కూడా క్షతగాత్రునికి సహకారం అందజేశారు.


