సెల్‌ టవర్‌ ఎక్కి మందుబాబు హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

సెల్‌ టవర్‌ ఎక్కి మందుబాబు హల్‌చల్‌

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

రాయగడ: మొబైల్‌ టవర్‌ ఎక్కిన మందుబాబు హల్‌చల్‌ చేశాడు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌లో సొమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి యువకుడిని కిందకు దింపారు. వివరాల్లోకి వెళితే.. కళ్యాణసింగుపూర్‌లోని కుంబారి వీధికి చెందిన త్రిలోచన్‌ కాశీ పూటుగా తాగి సమీపంలో గల సెల్‌ టవర్‌ పైకి ఎక్కాడు. కిందకు దిగాలని స్థానికులు పలుమార్లు వారించినప్పటికీ పట్టించుకోకుండా తాను టవర్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానిని బెదిరించాడు. దీంతో కాసేపు అక్కడ హైడ్రామా నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు రెండు గంటలపాటు మందుబాబుని బుజ్జగించి కిందకు దించారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement