● అడుగంటినది | - | Sakshi
Sakshi News home page

● అడుగంటినది

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు గత నాలుగు రోజులుగా (రోహిణి కార్తెలతో) నమోదవుతున్నాయి. పర్లాకిమిడి, పాతపట్నం సరిహద్దులో ఉన్న మహేంద్రతనయ నది ఎండలకు నీరు అడుగంటిపోయింది. ఎండలకు పట్టణంలో రోజూ టాటా పవర్‌ డిస్ట్రీబ్యూషన్‌ కంపెనీ 114 నిమిషాలు, ఉదయం సాయంత్రం పూట పవర్‌ కట్‌ చేస్తుంది. ఉదయం 11 గంటలకు 36 డిగ్రీలు, మధ్యాహ్నం 1 గంటకు 40 డిగ్రీల సెంటీ గ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మార్కెట్‌కు అతి తక్కువ మంది సరుకులు కోనడానికి వస్తున్నారు. వృద్ధులు, పిల్లలు ఉక్కపోతతో అవతస్థలు పడుతున్నారు. మే 15 నుంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement