మాత్తిలి గ్రీవెన్స్‌లో 57 వినతులు స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

మాత్తిలి గ్రీవెన్స్‌లో 57 వినతులు స్వీకరణ

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

మాత్తిలి గ్రీవెన్స్‌లో 57 వినతులు స్వీకరణ

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి దుంగియాపూట పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్‌ ప్రధమేశ్‌ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్‌ సోమనాథ్‌ ప్రధన్‌ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహించి 57 వినతులు స్వీకరించారు. వీటిలో 22 వ్యక్తిగత ఫిర్యాదులు కాగా 35 గ్రామస్థాయి సమస్యలు ఉన్నాయి. అలాగే వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక సహాయ శిబిరాలు నిర్వహించారు. మాత్తిలి బీడీఓ ప్రమోద్‌ బెహరా అధ్యక్షతన పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా వైద్యాధికారి డోలామణి ప్రధన్‌, జిల్లా అదనపు ఎస్పీ రశ్మిరంజన్‌ సేనాపతి పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్‌ ప్రధమే శ్‌ అర్వింద్‌ రాజశిర్కే కలిమెల సమితిలో బాడిగేటా, మల్కన్‌గిరి సమితిలో ఝూరపల్లి, చిత్రకొండ సమితిలో బడపోఢ పంచాయతీ, ఖోయిర్‌పూట్‌ సమితి లో గోవిందపల్లి, కోరుకొండ సమితిలో మారివా డా, పోడియా సమితిలో బాపన్‌పల్లి పంచాయతీలో గ్రీవెన్స్‌ను నిర్వహించి వినతులు స్వీకరించారు.

ఆర్‌.ఉదయగిరిలో..

పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్‌.ఉదయగిరి సమితి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రామ సభకు మంచి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్‌ అక్షయసునీల్‌ అగర్వాల్‌, ఆర్‌.ఉదయగిరి, సబ్‌ డివి జనల్‌ పోలీసు అధికారి రాజేష్‌కుమార్‌ సాహు, జిల్లా పరిషత్తు సీఈవో దయామయ పాఢి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంశుమాన్‌ మహాపాత్రో, సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా హాజరయ్యారు. 25 వినతు లు రాగా అందులో వ్యక్తిగతం 9, గ్రామ సమస్యల కు సంబంధించి 16 ఉన్నాయి. సీఎంఆర్‌ఎఫ్‌ క్రింద ఎటువంటి సహాయం అందలేదు. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు, రోడ్డు సౌకర్యం, మంచినీటి సమస్యలపై ఎక్కువు వినతులు అందాయి. ఆర్‌.ఉదయగిరి తహసీల్దార్‌, బీడీవో హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement