రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

కరువు భత్యం 2 శాతం పెంపు

భువనేశ్వర్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫింఛన్‌దారులకు ముఖ్యమంత్రి తీపి కబురు అందజేశారు. ఉద్యోగులకు కరువు భత్యం 2 శాతం పెంచినట్లు ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ శుక్రవారం ప్రకటించారు. దీని ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. ఈ పెరుగుదల ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తిస్తుంది. ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వ ఫించనుదారుల టీఐ 2 శాతం పెంచినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. పెరిగిన లెక్క ప్రకారం మొత్తం మే నెల జీతంలో నగదు రూపంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీని వల్ల రాష్ట్రంలోని సుమారు 8 లక్షల 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఫించనుదారులు లబ్ధి పొందుతారు.

దివ్యాంగురాలికి

ఆర్థిక సహాయం

రాయగడ: జిల్లాలోని కళ్యాణసింగుపూర్‌ సమితి బొలదియా గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ప్రస్కాకుమారి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ విషయం తెలుసుకున్న రుషి మహిమా సేవా సంస్థ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. నిత్యావసర సరుకులు, కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందించారు. సమాజసేవకుడు టి.చంద్రశేఖర్‌, వార్డు సభ్యులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement