నేటి నుంచి పీజీ సెట్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పీజీ సెట్‌

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

ఎచ్చెర్ల : రాష్ట్రంలో పలు యూనివర్శిటీలు, అనుబంధ కళాశాలల్లో ఆర్ట్స్‌, సైన్స్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 8 నుంచి నాలుగు రోజులపాటు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారు వెబ్‌ ఆప్షన్స్‌ ద్వారా ఎచ్చెర్లలోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వ విద్యాలయంలో వివిధ కోర్సుల్లో సీట్లు పొందవచ్చు.

● ఆర్ట్స్‌ కళాశాలకు సంబంధించి ఎం.కాం, ఎం.ఎ (ఎకనామిక్స్‌), ఎం.ఎ (రూరల్‌ డెవలప్‌మెంట్‌), ఎంఈడీ, ఎం.ఎల్‌.ఐ.సీ (లైబ్రరీ సైన్స్‌), ఎం.ఎ(సోషల్‌వర్క్‌), ఎం.ఎ (ఇంగ్లీష్‌), ఎం.ఎ (తెలుగు), ఎం.జె.ఎం.సి (జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌) కోర్సులకు వెబ్‌ కౌన్సిల్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసిన విద్యార్థులు ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చు.

● సైన్స్‌ కళాశాలకు సంబంధించి ఎం.ఎస్సీ (బయోటెక్నాలజీ), ఎం.ఎస్సీ (మైక్రో బయాలజీ), ఎం.ఎస్సీ (ఆర్గానిక్‌ కెమిస్ట్రీ), ఎం.ఎస్సీ (అనలైటికల్‌ కెమిస్ట్రీ), ఎం.ఎస్సీ (మేథమెటిక్స్‌), ఎం.ఎస్సీ (అప్లయిడ్‌ మేథమెటిక్స్‌), ఎం.ఎస్సీ (ఫిజిక్స్‌)లకు ఏపీపీీజీసెట్‌–2026 ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. పూర్తి వివరాలకు సీఈటీఎస్‌.ఏపీఎస్‌సీహెచ్‌ఈ.ఎపీ.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

అధునాతన వసతులు..

పీజీ ప్రవేశాలు పొందినవారికి అంబేడ్కర్‌ వర్శిటీ పలు వసతులు కల్పిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన హాస్టళ్లు, కిచెన్లు, గ్రంథాలయాలు, వ్యాయామశాలలు, ప్రయోగశాలలు, యోగా హాళ్లు, హెల్త్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. జీసీసీ కేఫ్‌, క్యాంటీన్‌, బ్యాంక్‌, వైఫై సదుపాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలకు విద్యార్థులు అర్హులేనని రిజిస్ట్రార్‌ బి.అడ్డయ్య తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement