మల్కన్‌గిరి : మల్కన్‌గిరి కేసీసీ బ్యాంక్‌లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ఘటనలో ఒడిశా విజిలెన్స్ పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కేసులో బ్యాంకు శాఖ మేనేజర్ సుధాంశు ఖోరాను ముందుగానే అరెస్టు చేశారు. శుక్రవారం ఆయన సహచరులు సుశ్రీ నివేదిత, ఆమె ప్రియుడు నృసింహ ప్రసాద ఖమారిను అరెస్టు చేశారు. వీరి నుంచి 25 బ్యాంక్ ఖాతాలు, 33 మొబైల్ ఫోన్లు, డ్రోన్ కెమెరాలు, విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ జంట భువనేశ్వర్ ఖుర్దాలో ఇలా అనేక చోట్ల వీరి మోసచరిత్ర ఉన్నట్లు విజిలెన్స్ దర్యాప్తులో తెలిసింది.


