రెడ్‌క్రాస్‌ సేవలు స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ సేవలు స్ఫూర్తిదాయకం

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

రెడ్‌క్రాస్‌ సేవలు స్ఫూర్తిదాయకం

మల్కన్‌గిరి: రెడ్‌క్రాస్‌ సంస్థ ద్వారా అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. మల్కన్‌గిరి కళాశాల సమావేశ మందిరంలో శుక్రవారం ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం డాక్టర్‌ చిత్తరంజన్‌ బారిక్‌ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్‌ సోమనాథ్‌ ప్రధాన్‌, కన్వీనర్‌ కార్యదర్శ రంజాన కుమార్‌ స్వాయి, జిల్లా యువ రెడ్‌క్రాస్‌ కన్వీనర్‌, కార్యదర్శి విఘ్నేశ్వర్‌, స్వచ్ఛంద సేవకులు శుభలక్ష్మీ సాహు, సునేలి మహారాణ, అంబికా ఖరా, సనతన్‌ కబసి, సురజ్‌ మల్లిక్‌, ఇస్పితా దాస్‌, జి.సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement