ఏపీఈసెట్‌ ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత | - | Sakshi
Sakshi News home page

ఏపీఈసెట్‌ ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీఈసెట్‌–2026 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఈ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు 90.97 శాతం ఉత్తీ ర్ణతను సాధించి మెరిశారు. పాలిటెక్నిక్‌ చదివి ఇంజినీరింగ్‌ కోర్సు ల్లో నేరుగా రెండే ఏడాది ప్రవేశా లు పొందేందుకుగాను రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు జేఎన్‌టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్‌ పరీక్ష ఏప్రిల్‌ 23వ తేదీన రెండు సెషన్లగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెలువడ్డాయి.

ఈసారీ బాలికలే టాప్‌..

ఎప్పటిలాగే సారి కూడా బాలికలే టాప్‌లేపే ఫలితాలు సాధించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 1389 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 1340 మంది హాజరయ్యారు. వీరిలో 1219 మంది ఉత్తీర్ణత సాధించి అర్హత సాధించారు. ఇందులో 923 మంది బాలురుకుగాను 89.17 శాతం ఉత్తీర్ణతతో 823 మంది క్వాలిఫై అవ్వగా, 417 మంది బాలికలకుగాను 94.6 శాతం ఉత్తీర్ణతతో 396 మంది అర్హత పొందారు. వివిధ బ్రాంచీల్లో పలువురు విద్యార్థులు అదిరేటి ర్యాంకులు పొందారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో పలాస మండల పరిధిలోని తాళ్లభద్ర గ్రామానికి చెందిన కుప్పిలి నిఖిల్‌కుమార్‌ స్టేట్‌లో 7వ ర్యాంకు సాధించాడు.

లింగాలవలస విద్యార్థికి

ఈసెట్‌లో 33 వ ర్యాంక్‌

జలుమూరు: లింగాలవలసకు చెందిన పంచిరెడ్డి పవన్‌ కల్యాణ్‌కు ఈసెట్‌లో 33వ ర్యాంక్‌ వచ్చింది. అలాగే ఇంటిగ్రేటెడ్‌ ర్యాంక్‌ 973. ఒకటి నుంచి ఐదు వరకూ చల్లవానిపేట విజ్ఞాన దుర్గ, ఆరు నుంచి పది వరకూ కరవంజ ఆదర్శ పాఠశాలలో చదివాడు. తల్లి దండ్రులు జయలక్ష్మి, ప్రకాశరావు. ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసు సాధనే తన లక్ష్యమని పవన్‌కల్యాణ్‌ తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement