ఘోర రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

లారీని ఢీకొట్టిన కారు

తండ్రీకొడుకుల దుర్మరణం

మరో ముగ్గురు మహిళలకు

తీవ్రగాయాలు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాత్తిలి పోలీస్‌స్టేషన్‌ సమీపంలో లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 నెలల బాబుతోపాటు తండ్రి దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. కొరాపూట్‌ నుంచి మల్కన్‌గిరికి శనివారం బంధువుల ఇంట జరిగిన ఓ ఫంక్షన్‌కు పొట్నూరు మణికాంతారావు తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత ఆదివారం తిరిగి కారులో వెళ్తుండగా లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో మణికాంతారావు (25)తో పాటు అతని 11 నెలల కుమారుడు మృతి చెందారు. అయితే కారు లాక్‌ అయి ఉండడంతో స్థానికులు పోలీసులు, అగ్నిమాపిక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న సిబ్బంది కారు డోర్లను కట్టర్ల సాయంతో కోసి అందులో ఉన్న వారిని బయటకు తీశారు. అయితే తండ్రీకొడుకు మృతి చెందగా ముగ్గురు మహిళలు గాయపడ్డారు. తండ్రికొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మాత్తిలి ఆరోగ్య కేంద్రంకు తరలించారు. క్షతగాత్రులను చికిత్స కొసం తొలుత మాత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కొరాపుట్‌కు రిఫర్‌ చేశారు. మాత్తిలి ఐఐసీ దీపాంజలి ప్రధాన్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement