రైతుల ఆందోళనకు జయపూర్‌ ఎమ్మెల్యే మద్దతు | - | Sakshi
Sakshi News home page

రైతుల ఆందోళనకు జయపూర్‌ ఎమ్మెల్యే మద్దతు

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

రైతుల ఆందోళనకు జయపూర్‌ ఎమ్మెల్యే మద్దతు

కొరాపుట్‌: కొక్సర రైతుల ఆందోళనకు కాంగ్రెస్‌ పా ర్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జయపూర్‌ ఎమ్మెల్యే తారా ప్రసాద్‌ బాహీనీపతి మద్దతు పలికారు. సోమవారం కలహండి జిల్లా కొక్సర ప్రాంత రైతు ఆందోళన శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ ప్రాంతంలో 15 వేల మంది రైతుల పేర్లు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు కాలేదన్నారు. దాంతో వారు స్ధానికి ఎంఎల్‌ఏతో కలసి సీఎంతో పాటు అన్ని పార్టీల నాయకులను కలిశారన్నారు. కానీ ఫలితం లేకపోయిందన్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాలలో రైతుల పేర్లు నమోదు కాలేదన్నారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు వ్యవసాయం మీద జీవిస్తున్నారన్నారు. ఈ సమస్య పై రానున్న అసెంబ్లీ సమావేశాలలో పోరాటం చేస్తామని బాహీని పతి ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement