మల్కన్‌గిరి: పిల్లలను అపహరించడానికి వచ్చినట్టు భావించిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు పోలీసు స్టేషన్ పరిధిలోలోని ఎంవీ 114 గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పిల్లలను అపహరించడానికి వచ్చిన వ్యక్తిని స్థానికులు పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఎం.వి.60 గ్రామానికి చెందిన సుబ్రత్ మండాల్ ఎంవీ 114 గ్రామానికి చెందిన మహిళను ప్రేమించేవాడు. ఆ మహిళ తో కలిసి ఇద్దరు ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. అయితే ఆ మహిళ కొద్దీరోజుల క్రితమే అక్కడ నుంచి సొంతఊరుకి వచ్చి ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సుబ్రత్‌తో కలవలేదు.. మాట్లాడలేదు. దానితో సుబ్రత్ మాహిళను కలవాలని భావించాడు. బిడ్డను అపహరిస్తే ఆమె తన వద్దకు వస్తుందని భావించాడు. సోమవారం తెల్లవారు జామునవచ్చి ఉదయం ఆరు గంటల మహిళ పిల్లవాడు అనుకొని పొరపాటున పక్కింటి పాపను అపహరించాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు వెంటనే పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. అనంతరం మోటు పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితున్ని అరెస్టు చేశారు. ముందుగా పోలీసులు కలిమెల ఆరోగ్యకేంద్రంలో ్ చికిత్స ఇప్పించి అనంతరం కేసు నమోదు చేసి పూర్తి విచారణ అనంతరం కోర్టుకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.


