జయపురం అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

జయపురం అభివృద్ధికి కృషి

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

జయపురం: కొరాపుట్‌ పార్లమెంట్‌ సభ్యుడు సప్తగిరి శంకర ఉల్క జిల్లా అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషికి కొరాపుట్‌ జిల్లా న్యాయవాదుల సంఘం మంగళవారం సన్మాణించింది. ఈ సందర్భంగా న్యాయ వాదుల సంఘ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యుడు పిట్టా రమేష్‌ పాత్రో, జిల్లా అధ్యక్షుడు బిజయ రాయ్‌ జనాదేవ్‌, ఉపాధ్యక్షుడు శరత్‌ మఝి, కార్యదర్శి సహదేవ్‌ పట్నాయక్‌, కోశాధికారి వి.రామానుజ ప్రసాద్‌, తదితరులు ఎంపీ సప్తగిరి ఉల్క, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రూపక్‌ తురుక్‌ను స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయవాదుల మండలి సభ్యుడు రమేష్‌ పాత్రో మాట్లాడుతూ.. గతంలో జయపురంలో హైకోర్ట్‌ బెంచ్‌ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఎంపీ నిర్వహించిన భూమికను గుర్తు చేశారు. ఇక ముందు కూడా న్యాయవాదుల ప్రయోజనాల కోసం లోక్‌ సభలో గళం విప్పాలని కోరారు. జిల్లా న్యాయవాదుల సంఘ నూతన భవన ఉన్నతికి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి కొంత మొత్తం సమకూర్చాలని జిల్లా న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు జనాదేవ్‌ విజ్ఞప్తి చేశారు. ఎంపీ ఉల్క మాట్లాడుతూ జయపురం అభివృద్ధికి కోసం తాను అన్ని వేళలా ముందుంటానని వెల్లడించారు. జయపురం నుంచి భువనేశ్వర్‌కు పగటి పూట రైలు నడపాలని లోక్‌ సభలో పదే, పదే తాను డిమాండ్‌ చేస్తున్నానని తెలిపారు. భువనేశ్వర్‌–విశాఖపట్నం వందే భారత్‌ రైల్‌ను అరుకు మీదుగా కొరాపుట్‌ వరకు పొడిగించాలని పార్లమెంట్‌లో తాను డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో జయపురం విమానాశ్రయం విస్తరణ, జయపురం నుంచి – మల్కనగిరి, జయపురం నుంచి నవరంగపూర్‌ రైల్వే లైన్లు త్వరతిగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానన్నారు. జయపురం పట్టణం ఉన్నతికి తాను కట్టుబడి ఉంటానని, న్యాయవాదుల సంఘం ఏ ప్రతిపాదన చేసినా అమలు చేసేందుకు కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.

అనంతరం న్యాయవాదుల సంఘం నూతన భవనాన్ని సందర్శించారు. భవనాన్ని మరింతగా అభివృద్ధి పరచే విషయంపై తాను జిల్లా కలెక్టర్‌తో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ సహాయ కార్యదర్శి భోళా పట్నాయక్‌, సభ్యులు తరణి పాణిగ్రహి, దాశరథి పట్నాయక్‌, సుభాష్‌ పండా, లాల్‌ మోహన్‌ షడంగి, రాజేంద్ర కుమార్‌ గౌడ, అరుణ పండా, నళినీ రథ్‌, రేఖా భాయ్‌, సురేష్‌ పట్నాయక్‌, బిభూతి పట్నాయక్‌, శిశిర మిశ్ర, ఆరతి మహంతి, తదతరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement