గుండెపోటుతో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

గుండెపోటుతో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి రక్తదానం.. ప్రాణదానం వేతనాలు పెంచాలని కార్మికుల నిరసన

కొరాపుట్‌: విధి నిర్వహణలో సీఆర్పీఎఫ్‌ జవా ను మృతి చెందాడు. సోమవారం నబరంగ్‌పూర్‌ జిల్లా నందాహండి సమితికి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ రంజన్‌ హరిజన్‌ (27) పంజాబ్‌ రాష్ట్రంలోని పఠాన్‌ కోట్‌లో విధి నిర్వహ ణలో ఉండగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. 2003లో కాశ్మీర్‌లో విధుల్లో చేరిన రంజన్‌ అనేక ప్రాంతాల్లో పనిచేశాడు. మృత దేహం స్వస్థలానికి చేరడంతో స్థానిక ప్రజలు, పోలీసు ఉన్నతాధికారులు నివాళులర్పించారు.

జయపురం: ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పూజ్య గురుదేవ్‌ జన్మదినం సందర్భంగా సోమవారం కొట్‌పాడ్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కుటుంబ సభ్యులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గురుదేవ్‌ జన్మదిన ఉత్సవా లు దేశ వ్యాన్తంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకు లు వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 10వ తేదీన బెంగుళూరులో గల గురుదేవ్‌ ఆశ్రమానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. సోమవారం కొట్‌పాడ్‌ శ్రీరామ మందిర సమీపంలో గల గోపబందుపాఠాఘర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించామని, 40 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపా రు. గురుదేవ్‌ గత 45 ఏళ్లుగా యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తున్నారన్నారు. యోగా శిక్షణ ఇచ్చా మని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో గౌర చంద్ర రథ్‌, సూర్య కాంత పాడీ, విశ్వజిత్‌ మల్లిక్‌, బెనర్జీ రావు, తపన మహాపాత్రో, కిశోర్‌ మిశ్ర, ప్రదీప్‌ ప్రధాన్‌, కెల్ల గోపి, అశోక్‌ మిశ్ర, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పరివార సభ్యులు పాల్గొన్నారు.

మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీగా భాస్కర్‌రెడ్డి

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు డీఎస్పీగా ఎన్‌.భాస్కర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో వీఆర్‌ఎస్‌లో ఉన్న ఈయన నేరుగా పోస్టింగ్‌పై శ్రీకాకుళం వచ్చారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఈయన అనంతపురంలో ఎస్‌ఐ, సీఐగా పనిచేశారు. కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదే స్టేషన్‌కు డీఎస్పీగా బి.రాజశేఖర్‌ వచ్చినప్పటికీ కొన్ని నెలలు పనిచేసి వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిన్నర పోస్టు ఖాళీగా ఉండటంతో సీఐలతోనే స్టేషన్‌ నెట్టుకువచ్చారు. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో వంటి కీలక కేసులను ఎక్కువగా మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీకే తమ విచక్షణాధికారాన్ని బట్టి ఉన్నతాధికారి అప్పజెప్పేవారు. ఇక్కడ డీఎస్పీ పోస్టింగ్‌లో జాప్యం రావడంతో ఇతర డివిజన్ల అధికారులకు అదనంగా బాధ్యతలు పడ్డాయి.

బీచ్‌ కబడ్డీలో సిక్కోలు అ‘ద్వితీయం’

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం కబడ్డీ జట్లు మరోసారి సత్తాచాటాయి. ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్‌ బీచ్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా మహిళా జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ పోటీలు ఈ నెల 7 నుంచి 10 వరకు నెల్లూరు జిల్లా దువ్వూరు వేదికగా జరిగాయి. పురుషుల జట్టు సెమీస్‌లో నిష్క్రమించగా..మహిళల జట్టు తుది వరకు పోరాడింది. వీరి రాణింపు పట్ల జిల్లా కబడ్డీ సంఘ చైర్మన్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌, జిల్లా అధ్యక్షుడు నక్క రామకృష్ణ, కార్యదర్శి సాదు ముసలినాయుడు, సాదు శ్రీనివాస్‌, సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు.

రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో ని ఆంధ్రా ఆర్గానిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పరిశ్ర మ కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ విధులు బహిష్కరించి పరిశ్రమ ఎదుట సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికు ల పేరుతో అతి తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమదోపిడీకి పాల్పడటం తగదన్నారు. ధరలు విపరీతంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా వేతనాలు పెంచకపోతే కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నించారు. అధిక సమయం పనిచేయించి సింగిల్‌ ఓటీ మాత్రమే ఇస్తున్నారని, మిగతా పరిశ్రమల్లో డబల్‌ ఓటీ ఇస్తారని చెప్పారు. నెల వేతనం బోనస్‌గా ఇవ్వాలని, అతి తక్కువ బోనస్‌ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు, చట్టబద్ధంగా వీడీఏ అమలు చేయా లని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement