సీఈఓతో బీజేడీ ప్రతినిధి బృందం భేటీ | - | Sakshi
Sakshi News home page

సీఈఓతో బీజేడీ ప్రతినిధి బృందం భేటీ

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

సీఈఓతో బీజేడీ ప్రతినిధి బృందం భేటీ ● 2 ఓట్లు రద్దు చేయాలి ● పారదర్శకత నిరూపనకు అభ్యర్థన

● 2 ఓట్లు రద్దు చేయాలి ● పారదర్శకత నిరూపనకు అభ్యర్థన

భువనేశ్వర్‌: ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన రాజ్య సభ ఎన్నికల సందర్భంగా ఇద్దరు భారతీయ జన తా పార్టీ శాసన సభ్యులకు రెండవ బ్యాలెట్‌ పత్రాలను అక్రమంగా జారీ చేశారని బిజూ జనతా దళ్‌ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేడీ శాసన సభ పక్ష ఉప నాయకుడు డాక్టరు ప్రసన్న ఆచార్య ఆధ్వర్యంలో ప్రతిపక్ష బిజూ జనతా దళ్‌ ప్రతినిధి బృందం సోమ వారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ఆర్‌ఎస్‌ గోపాలన్‌ను కలిసింది. ఇటీవల ముగిసిన రాజ్య సభ ఎన్నికల్లో బ్రహ్మగిరి నియోజక వర్గం ఎమ్మెల్యే ఉపాసన మహా పాత్రో, ఖల్లికోట నియోజక వర్గం ఎమ్మెల్యే పూర్ణ చంద్ర సెఠికి జారీ చేసిన తొలి బ్యాలెట్‌ పత్రాలపై ఓటు ముద్ర పెట్టినప్పటికీ వారికి రెండవ బ్యాలెట్‌ పత్రాలను తప్పుగా జారీ చేశారని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి సమర్పించిన ఒక వినతి పత్రంలో బీజేడీ ఆరోపించింది. దీని పట్ల తమ పోలింగ్‌, లెక్కింపు ఏజెంట్లు పదేపదే అభ్యంతరాలు లేవనెత్తిన పెడ చెవిన పెట్టి చెల్ల ని బ్యాలెట్‌ పత్రాలకు సంబంధించిన 1961 ఎన్నికల నిర్వహణ నియమావళి 41వ నియమం కింద నిర్దేశించిన షరతులను ఉల్లంఘించి ఎన్నికల అధికారులు రెండవ బ్యాలెట్‌ పత్రాలను జారీ చేయడానికి అనుమతించారని విపక్ష బిజూ జనతా దళ్‌ ఆరోపించింది. బిజూ జనతా దళ్‌ ప్రకారం ఎన్నికల సంఘం పరిశీలకుడు తొలుత రెండో బ్యాలెట్‌ పత్రాల జారీకి అనుమతి నిరాకరించారు. ఆ తర్వా త వాటిని అనుమతించడంతో ఈ నిర్ణయం యొక్క చట్టబద్ధత మరియు శాసన నిబంధనల నిబద్ధత పట్ల తీవ్ర ఆందోళనలు తలెత్తాయి. పోలింగ్‌ ఏజెంట్లు, ఎన్నికల ఏజెంట్లు, అధీకృత ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులు, పార్లమెంటరీ ప్రతినిధులు నిరంతరం, పలు స్థాయిలలో ఈ అంశాన్ని ఎన్నికల పవిత్రతను ప్రభావితం చేసే ఒక తీవ్రమైన చట్టబద్ధమైన ఉల్లంఘనగా పరిగణించాలని అభ్యర్థించారు.

రాజ్య సభ ఓటింగ్‌ ప్రక్రియలో తప్పిదంపై బీజేడీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు నవీన్‌ పట్నాయక్‌ బహిరంగంగా స్పందించారు. అనంతరం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ ఏడాది మార్చి 18న నవీన్‌ పట్నాయక్‌ ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 28న రాజ్య సభ ఎంపీ డాక్టరు సస్మిత్‌ పాత్రో తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భారత ఎన్నికల సంఘానికి ఒక వివరణాత్మక వినతిపత్రాన్ని సమర్పించారు. ఆ విజ్ఞప్తి నేపథ్యంలో బీజేడీ ప్రతినిధి బృందం సమస్యలను వినాల్సింది గా ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓను ఆదేశించినట్లు సమాచారం.

రాజ్యసభ అభ్యర్థి దిలీప్‌ రేకు అనుకూలంగా ఉపాసన మహా పాత్రో, పూర్ణ చంద్ర సెఠి వేసిన ఓట్లను తిరస్కరించాలని బీజేడీ తన వినతిపత్రంలో డిమాండ్‌ చేసింది. ఆ 2 ఓట్లను అనుమతించకపోతే తమ పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి డాక్టర్‌ దత్తేశ్వర్‌ హొత్తాకు ఎక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లు వస్తాయి. అందువల్ల ఆయనను ఎన్నికై నట్లు గా ప్రకటించాలని సవివరంగా విశ్లేషించి అభ్యర్థించారు. ఈ ఏడాది మార్చి 16 మరియు 18 తేదీలలో తాము చేసిన మునుపటి ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని బిజూ జనతా దళ్‌ కోరింది. దీంతో బాటు రద్దు చేసన బ్యాలెట్‌ పత్రాలు, పరిశీలకుల నివేదికలు, పోలింగ్‌, లెక్కింపు రికార్డు లు, సీసీటీవీ ఫుటేజ్‌, వీడియోగ్రఫీ, ఫోటోగ్రాఫ్‌లు మరియు ఇతర అధికారిక ఎన్నికల సామగ్రితో సహా ఈ వివాదానికి సంబంధించిన అన్ని రికార్డుల ను భద్రపరచి, పరిశీలించాలని సీఈఓను బీజేడీ ప్రతినిధి బృందం కోరింది. రెండవ బ్యాలెట్‌ పత్రాలను ఏ పరిస్థితులలో జారీ చేశారనే దానిపై స్వతంత్ర, పారదర్శక విచారణ జరిపి 1961 ఎన్నికల నిర్వహణ నియమావళి 41వ నియమం ఉల్లంఘించబడిందా లేదా అనే దానిపై నిర్ధారణ చేయాలని బీజేడీ డిమాండ్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement