మట్టిలో మాణిక్యం.. | - | Sakshi
Sakshi News home page

మట్టిలో మాణిక్యం..

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

రెడ్‌ క్రాస్‌ నిధికి ప్రతిఒక్కరూ సహకరించాలి

రాయగడ: స్థానిక రాయగడ స్వయం ప్రతిపత్తి కళాశాల స్నాతక, స్నాతకోత్సవ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. స్నాతక స్థాయి కళల (ఆర్ట్స్‌) విభాగం 12 శాఖల్లో తెలుగు శాఖకు చెందిన పచమట్ల వర్షిత 9.05 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన వర్షిత పాఠశాల విద్య నుంచి ఉత్తమ ప్రతిభ కనబరిచేది. పిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన వర్షిత.. తల్లి, వదిన సంపాదన మీదే ఆధారపడింది. ఎలాగైనా ఉన్నత విద్యను అభ్యసించి అధ్యాపక వృత్తి చేపట్టానలన్నదే ధ్యేయంగా నిరంతరం కృషి చేసింది. వర్షిత సాధించిన ఈ విజయానికి కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థులు వర్షితను స్ఫూర్తిగా తీసుకోవాలని అధ్యాపకులు అన్నారు.

హెల్ప్‌లైన్‌ నంబర్ల విడుదల

జయపురం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జయపురం పట్టణ పోలీసు అధికారులు ప్రజల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను శుక్రవారం విడుద ల చేశారు. ఈ కార్యక్రమానికి జయపురం సబ్‌డివిజన్‌ పోలీసు అధికారి అర్చిత మిత్తల్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసుల స హాయం కోసం 112, అంబులెన్స్‌కు 108, అగ్నిమాపక సేవలకు 101, సైబర్‌ నేరాల ఫిర్యాదులకు 1030, బాలల సహాయ సేవలకు 1098, మహిళల సహాయ సేవలకు 181 నంబర్లకు ఫోన్‌ చేయాలని ఎస్‌డీపీఓ అర్చిత మిత్తల్‌ వెల్లడించారు. ప్రజలు ఈ సేవలను సద్విని యోగ పరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. జయపురం పట్టణ పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారి ఉల్లాష్‌ చంద్ర రౌత్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కృషి

ఉద్యోగ యోజనపై సమీక్ష

పర్లాకిమిడి: ముఖ్యమంత్రి కృషి ఉద్యోగ యోజన ద్వారా రైతులు లాభసాటి వ్యవసాయం, రొయ్యల పెంపకం, లేయర్‌ఫార్మ్‌, ఉద్యానవనాలు పెంపకం ద్వారా ప్రయోజనం పొందవచ్చని జిల్లా ముఖ్య వ్యవసాయాధికారి ఎం.ప్రకాశరావు తెలిపారు. కలెక్టరేట్‌లో హాల్‌.2లో శుక్రవారం ఎం.కె.యు.వై. పథకంపై ఆగ్రో ఎంటర్‌ప్రైజర్స్‌, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ ఫల్గుణీ మఝి, జిల్లా ముఖ్య ప్రాణి చికిత్సా అధికారి డాక్టర్‌ తుషారేందు నాయక్‌, అటవీ శాఖ రేంజర్‌ నిరోధచంద్ర నాయక్‌, డి.ఎం.ఆపికోల్‌ బిపిన్‌కుమార్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

పర్లాకిమిడి: ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవాన్ని స్థానిక కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం ఉదయం జిల్లా అత్యవసరశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏడీఎం మునీంద్ర హానగ ముఖ్యఅతిథి గా విచ్చేశారు. ప్రముఖ మానవతావాది జీన్‌ హెన్రీ డమంట్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిని వెలిగించారు. మానవత్వంలో ఏకత్వం... ప్రపంచంలో ఎక్కడ విధ్వంసం, యుద్ధాలు, విపత్తులు జరిగి నా రెడ్‌ క్రాస్‌ సొసైటీ స్పందించటం అనేది రెడ్‌ క్రా స్‌ వాలంటీర్ల స్ఫూర్తి అని రెడ్‌ క్రాస్‌ నోడల్‌ అధికారి బినాయక్‌ చంద్రరౌళో అన్నారు. సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి మాధవానంద నాయక్‌, జిల్లా శిశు సురక్షా అధికారి అరుణ్‌కుమార్‌ త్రిపాఠి, తదితరు లు హాజరయ్యారు. గజపతి జిల్లాలో ఒక్క రోడ్డు రవాణా సంస్థ, ఒక్కటే అత్యధిక మొత్తంలో రెడ్‌ క్రా స్‌ నిధులు సేకరిస్తుందని, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా స్పందించి విరాళాలు సేకరించాలని ఏడీఎం మునీంద్ర హానగ కోరారు. గత ఏడాది జిల్లా వ్యా ప్తంగా ఇండియాన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ రూ.20.53 లక్షల సేకరించగా, దానిలో ఆర్‌.టి.ఓ. (గజపతి) రూ. 16.63 లక్షలు సేకరించిందని అందుకు ప్రతిగా ఆ శాఖకు మెమొంటో, ప్రశంపాపత్రాన్ని ఏడీఎం హాన గ అందజేశారు. అనంతరం ఎక్సైజ్‌శాఖ, మోహనా ప్రభుత్వ ఎస్‌.ఎస్‌.డి పాఠశాల, రక్తదానం చేసిన అత్యధికులకు కూడా ప్రశంసాపత్రాల్ని అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement