● అలా.. ఉమ్‌లింగ్‌లా వరకు | - | Sakshi
Sakshi News home page

● అలా.. ఉమ్‌లింగ్‌లా వరకు

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

ఉమ్‌లింగ్‌లా శిఖరాన్ని అధిరోహించిన కిశోర్‌

జిల్లా నుంచి బైక్‌పై సాహస యాత్ర చేసిన యువకుడు

రణస్థలం:

ణస్థలం మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ కిశోర్‌ సాహస యాత్ర చేశాడు. ఉమ్‌లింగ్‌లా శిఖరాన్ని అధిరోహించాడు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోటారు వాహనాలు తిరగగలిగే ప్రదేశం. లఢక్‌ ప్రాంతంలో ఉంటుంది. ఏప్రిల్‌ 18న కిశోర్‌ ఈ సాహస యాత్ర మొదలుపెట్టాడు. ఈ నెల 5వ తేదీన అక్కడకు క్షేమంగా చేరుకున్నాడు. లఢక్‌ ప్రాంతం నుంచి ఉమ్‌ లింగ్‌ లా చేరుకునేందుకు ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నీ తట్టుకుని గమ్యస్థానం చేరుకున్నాడు. జిల్లా నుంచి మొట్టమొదటి సారిగా అంతదూరం సాహసయాత్ర చేసిన వ్యక్తిగా నిలిచాడు. కిశోర్‌ తల్లిదండ్రు లు పతివాడ కమల, పతివాడ నర్సింహమూర్తి వ్యవసాయ కూలీలు. కిశోర్‌ ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. కొండములగాం గ్రామానికి చెందిన మేనమామ లారీతో డ్రైవింగ్‌ వెళుతుంటానని చెప్పారు. అలాగే అప్పుడప్పుడు సాహసయాత్రలకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపారు.

ఉమ్‌లింగ్‌ లా ఎందుకంత ప్రత్యేకం..?

ఉమ్‌లింగ్‌ లా ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మోటర్‌బుల్‌ రోడ్డుగా ప్రపంచ ఖ్యాతి గడించింది. 19,024 అడుగులు అంటే 5798 మీటర్ల ఎత్తులో అత్యంత ప్రమాదక బైక్‌ రైడింగ్‌ ప్రాంతమిది. ఎంతోమంది సాహస బైక్‌ రైడర్లు ఈ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమైన గడ్డకట్టే చలి, వాతావారణం అనుకూలించక సగంలోనే తిరుగు బాట పడుతుంటారు. పదిహేడు రోజుల్లోనే ఈ సాహస యాత్ర పూర్తి చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని కిశోర్‌ చెప్పారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు వాళ్లు ఈ సాహస యాత్ర చేసినందుకు గుర్తింపు పత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement