గుడ్ల గూబకు చికిత్స | - | Sakshi
Sakshi News home page

గుడ్ల గూబకు చికిత్స

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

రాయగడ: కాలు విరిగి ఎగరలేని స్థితిళక్ష ఉన్న ఒక గుడ్లగూబను అటవీ శాఖ సిబ్బంది చికిత్స చేయించి తమ మానవీయతను చాటుకున్నారు. జిల్లాలోని కల్యాణసింగుపూర్‌ సమితి సునాఖండిలో గల హనుమాన్‌ మందిరం వద్ద పడి ఉన్న గుడ్ల గూబను చూసి పూజారి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న సిబ్బంది గుడ్ల గూబను చికిత్స చేయించి తిరిగి కోలుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టారు.

బిసంకటక్‌లో

భల్లూకం హల్‌చల్‌

రాయగడ: బిసంకటక్‌లోని మార్కమ వీధిలో శనివారం రాత్రి ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. సరాసరి వీధిలోకి ప్రవేశించిన ఎలుగు ఇళ్ల లోపలకు చొరబడేందుకు ప్రయత్నించింది. ఎలుగు అరుపులు రాకను గుర్తించిన వీధిలోని జనం ఒక్కసారిగా ఉలక్కిపడ్డారు. అనంతరం దానిని తరిమే ప్రయత్నం చేశారు. ఎప్పటికీ కదలకపోవడంతో భయాందోళనకు గురైన కాలనీ వాసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని ఎలుగును అక్కడ నుంచి సమీప అటవీ ప్రాంతంలోకి తరిమివేశారు.

డాబుగాం ఐఐసీ సస్పెన్షన్‌

కొరాపుట్‌: నబరంగ్‌పూర్‌ జిల్లా డాబుగాం ఐఐసీ రఘునాఽథ్‌ మజ్జిని సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర డీజీపీ వైబీ ఖురానియా నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఒక కేసు విచారణలో నిందితుడిని పోలీస్‌ స్టేషన్‌కి పోలీసులు తెచ్చారు. అయితే ఆ నిందితుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. దీంతో విధి నిర్వాహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఐఐసీ రఘునాఽథ్‌ మజ్జిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశించారు. ఈ కేసు విచారణ పూర్తయ్యేంత వరకు సదరన్‌ వెస్ట్రన్‌ రేంజ్‌ డిఐజీకి అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

66 సెల్‌ఫోన్లు స్వాధీనం

రాయగడ: ఝార్సుగుడ జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మోబైల్‌ ఫోన్లను పోగొట్టుకొవడం, దొంగతనానికి గురైన ఫిర్యాదులను నమోదు చేసుకున్న పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా 66 మోబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ గుండాల రెడ్డి రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఝార్సుగుడ పోలీస్‌స్టేషన్‌లో 15, సదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో 7, బ్రజరాజ్‌నగర్‌లో 6, బదమాల్‌లో 6, బెల్‌ఫహార్‌లో 5, బన్‌హార్‌పల్లిలో 4, లైకేరాలో 4, లఖన్‌పూర్‌లో 4, కొలాబిరాలో 4, రెంగాలిలో 3, ఎయిర్‌పోర్టులో మూడు.. మొత్తం 66 ఫోన్లను ట్రేస్‌ చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వీటిని పొగొట్టుకున్న వారి వివరాలను సేకరించి వారికి ఆందజేశారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

రాయగడ: జిల్లాలోని కాసీపూర్‌ సమితి మైకంచ్‌ గ్రామ సమీపంలో బొలేరో వాహనం ఢీకొని ముగ్గురు తీవ్రగాయాలకు గురయ్యారు. ఆది వారం జరిగిన ఈ ఘటనలో మైకంచ్‌ గ్రామానికి చెందిన లావణ్య జొడియా, పపున్‌ జొడియా, రామచంద్ర జొడియాలు గాయాలపాలయ్యారు. ఒకే బైకుపై వెళ్తున్న వీరిని గ్రామానికి సమీపంలోని కాలనీ వద్ద ఎదురుగా వచ్చిన బొలేరొ ఢీకొంది. దీంతో వీరంతా కిందపడిపోవడంతో గాయాలపాలయ్యారు. అయి తే ఢీకొట్టిమ వాహనం ఆగకుండానే వెళ్లిపోయింది. క్షతగాత్రులను కాసీపూర్‌ పీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement