గ్యాస్ ఓటీపీ అడిగాడు..
● హిరమండలం మండలంలో వెలుగుచూసిన వైనం
● ఆన్‌లైన్‌లో వివరాలు చెబితే అంతే..
● హెచ్చరిస్తున్న పోలీసులు
హిరమండలం: హిరమండలం మండంలోని పిండ్రువాడ, రెల్లివలసలో గుర్తు తెలియ ని యువకుడు మోసాలకు గురిచేశా డు. గ్యాస్ పేరుతో ఫోన్‌లకు నకిలీ మెసేజ్‌లు పెట్టాడు. గ్యాస్ వచ్చిందని నమ్మబలికి ఒక్కొక్కరి దగ్గర రూ.1000 వసూలు చేసి ఉడాయించాడు. అయితే ఆ రెండు గ్రామాల్లోనే కాదు. పరిసర ప్రాంతాల్లో ఈ మోసాలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు గ్యాస్ పేరుతో ఇలా మోసాలు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో విధిగా 45 రోజుల తరువాత కొత్త గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అటు ఫోన్లకు వచ్చే ఓటీపీ చెబితే కానీ గ్యాస్ అందించడం లేదు. ఈ నేపథ్యంలో గ్యాస్ ఓటీపీ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీస్ శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు జిల్లాలో జనగణన కూడా ప్రారంభమైంది. దీంతో ఎవరు ఎందుకు వస్తున్నారో? ఏ వివరాలు సేకరిస్తున్నారో తెలియని పరిస్థితి. అసలు జనగణన కోసం వచ్చేవారు ఏ వివరాలు తీసుకుంటారు? ప్రజలు ఏ వివరాలు ఇవ్వకూడదు? అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వడంతో పాటు అవగాహన పెంచడం చాలా ముఖ్యం.
ఆన్‌లైన్‌లోనూ వల
గ్యాస్ పేరుతో ఆన్‌లైన్‌లో కూడా మోసాలు జరుగుతున్నాయి. కొరతను ఆసరాగా చేసుకొని నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. రెండు రోజుల్లో గ్యాస్ సరఫరా అంటూ వల పన్నుతున్నారు. వారు పంపిన లింక్‌లను క్లిక్ చేసిన మరుక్షణం వినియోగదారుల ఫోన్లు మోసగా ళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. వినియోగదారుడు తెలుసుకునేలోగా మోసం జరిగిపోతోంది. వారి వలకు చిక్కకుండా ఉండేందుకు పోలీస్ శాఖ, గ్యాస్ డీలర్లు వినియోగదారులకు కీలక సూచనలు చేస్తున్నారు. అలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. గ్యాస్ వాహనాలు వచ్చి డెలివరీ బాయ్స్ సంప్రదించేవరకూ ఎవరూ స్పందించవద్దని కోరుతున్నారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఓటీపీలు అడగరన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కేవలం గ్యాస్ వాహనంతో డెలివరీ బా య్స్ వచ్చి వివరాలు అడిగితేనే చెప్పాలని సూచిస్తున్నారు.
గ్యాస్ పేరుతో అపరిచిత వ్యక్తులు వచ్చి ఓటీపీలు అడిగితే చెప్పొద్దు. గ్యాస్ వాహ నం రాకుండా ఇంటికి వచ్చి అడిగేవారు మోసం చేసేవారు అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. అదే సమయంలో ఆన్‌లైన్‌లో సైతం ఎలాంటి వివరాలు చెప్పకూడదు. చెబితే సైబర్ నేరగాళ్ల మాయలో పడినట్టే. అందుకే అప్రమత్తంగా ఉండాలి.
– వై.మధుసూధనరావు,
ఎస్‌ఐ, హిరమండలం


