ధాన్యం మండీ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం మండీ ఏర్పాటు చేయాలి

May 14 2026 6:33 AM | Updated on May 14 2026 6:33 AM

జయపురం: జయపురం సబ్‌ డివిజన్‌ కొట్‌పాడ్‌ పంచాయతీ సమితి చందిలి గ్రామ పంచాయతీ దేవుడ మౌజాలో ధాన్యం మండీ ఏర్పాటు చేయాలని స్థానిక రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం రైతు నాయకుడు పద్మనాభ బిశాయి ఆధ్వర్యంలో జయపురం సబ్‌కలెక్టర్‌ జాదు మణినాయిక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో ధాన్యం మండీ ఏర్పాటు చేసేందుకు స్థలం గుర్తించినా నేటికీ నిర్మించలేదని పేర్కొన్నారు. ఓ దళారీ పిప్లహండి గ్రామంలో మండీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఆ స్థలం రైతులకు ఉపయోగకరం కాదన్నారు.

కార్యవర్గం ఏర్పాటు

రాయగడ: కళింగ వైశ్య సంఘం కొత్తపేట శాఖకు నూతన కార్యవర్గం బుధవారం ఏర్పాటైంది. సంఘం అధ్యక్షుడిగా కొత్తకొట శ్రీధర్‌, ఉపాధ్యక్షుడిగా కొరపాన శ్రీనివాస్‌రావు, కార్యదర్శిగా పెద్దీన నాగేశ్వరరావు, సహాకార్యదర్శిగా మద్ది సురేష్‌ కుమార్‌, కోశాధికారిగా ఊళ్ల కాంతారావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ మేరకు కొత్తపేటలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి రాయగడ కళింగ వైశ్య సంఘానికి చెందిన ప్రతినిధులు నరేష్‌ కుముందాన్‌, కింతలి శ్యామసుందర్‌ రావు, తదితరులు కొత్తగా ఏర్పాటైన కార్యవర్గ సభ్యులను అభినందించారు.

సీబీఎస్‌ఈ ఫలితాల్లో

విద్యార్థుల ప్రతిభ

రాయగడ: సీబీఎస్‌ఈ ఇంటర్మీడియెట్‌ ప్లస్‌–2 పరీక్ష ఫలితాల్లో స్థానిక సెంచూరియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఐసారాణి దాస్‌ 90.2 శాతం మార్కులతో మొదటి స్థానం సాధించగా సుజయ్‌ మండల్‌, వర్షాపాడిలు 88 శాతం మార్కులతో రెంతో స్థానాన్ని దక్కించుకున్నారు. పబ్లిక్‌ స్కూల్‌ నుంచి మొత్తం 122 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. వారిలో 53 మంది డిస్టింక్షన్‌ సాధించారు. మిగతా విద్యార్థులంతా ఫస్ట్‌ క్లాస్‌ల్లో ఉత్తీర్ణులయ్యారు. తమ పిల్లల విజయంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేష్‌ కుమార్‌ పాఢి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.

ప్రజారవాణాకు ప్రాధాన్యమివ్వండి

భువనేశ్వర్‌: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావంతో ప్రపంచ చమురు సంక్షోభం తలెత్తింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ బుధవారం రాష్ట్ర ప్రజలకు సలహా జారీ చేశారు. చమురు దిగుమతులు గతం కంటే తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రైవేట్‌ వాహనాల వాడకాన్ని తగ్గించి ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించుకోవాలని కోరారు. దీనివల్ల ఖర్చులు ఆదా అయి చమురు సంక్షోభాన్ని కొంతమేరకై నా ఎదుర్కోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యవసరం అయితేనే వాహనాలను ఉపయోగించాలని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలన్నారు. అనవసరంగా బంగారం కొనుగోలు నివారించాలని, అత్యవసరం కాని విదేశీ పర్యటనలను వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి తన సొంత వాహనాల సంఖ్యను కూడా తగ్గించుకున్నట్లు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement