జయపురం: ప్రముఖ కవి, రచయిత, పత్రికా సందకుడు, విద్యాదాత, సమాజ సేవకుడు ప్రభుధాన్ భొత్ర జయంతి గురువారం ఘనంగా జరిగింది. భొత్ర స్థాపించిన స్థానిక ఫ్లోరెన్స్ నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ భాగృహంలో డాక్టర్ సుధాంశు శేఖర పట్నాయక్ అధ్యక్షతన జయంతి కార్యక్రమం నిర్వహించారు. భొత్ర చిత్రాలతో రచించిన ‘సంగరె సెల్ఫీ’ పుస్తకం ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేశారు. ‘దండకారణ్య సమాచార్’ పత్రిక సంపాదకులు బినోద్ మహాపాత్రో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భొత్ర అవిభక్త కొరాపుట్‌లో అనేక రంగాల్లో పని చేశారన్నారు. పత్రికా సంపాదకుడిగా పాత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు. ముఖ్యవక్తగా ఆల్ ఇండియ రేడియో విశ్రాంత అధికారి, స్థానిక పూజ్య పూజ సంసద్ అధ్యక్షుడు ఉదయ శంకర జాని, తదితరులు మాట్లాడుతూ.. ప్రభుదాన్ భొత్ర జీవన శైలి, వ్యక్తిత్వం, సమాజ సేవలను వివరించారు. పత్రికా సంపాదకులు బినోద్ మహాపాత్రను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరిశోధకులు అలోక్ మహరాణ, భారతీ మల్లిక్, సమాజ సేవి బాలారాయ్, అశోక్ మహనందియ, అశోక్ మహరాణ, అభినాష్ పాత్రో, నారాయణ మహాపాత్రో, బిపిన్ మహానందియ, సుభాష్ మహాపాత్రో, డాక్టర్ సబిత శతపతి, డాక్టర్ శౌభాగిణి నందో, తదితరులు పాల్గొన్నారు.


