భువనేశ్వర్: శ్రీ క్షేత్రం శ్రీ జగన్నాథుని వెలుపలి చందన యాత్ర బొడొ దండొ మార్గాన్ని కళా వేదికగా మలిచింది. శ్రీ మందిరం నుంచి నరేంద్ర సరోవరం తీరం వరకు దారి పొడవునా సాగే స్వామి పల్లకి ఊరేగింపులో హై టెక్ విద్యా సంస్థలో ఒడియా భాషా సాహిత్య విభాగం సీనియర్ ప్రొఫెసర్, అంతర్జాతీయ ఒడిస్సీ నర్తకుడు అయి న డాక్టర్ చిత్తరంజన్ సహాణి శాసీ్త్రయ నృత్య ప్రదర్శన సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత మూడు దశాబ్దాలుగా శ్రీ క్షేత్రం శ్రీమందిరంలో జరిగే చందన యాత్ర, స్నానోత్సవం, రథ యాత్ర, బహుడా, నీలాద్రి విజే, డోలా యాత్ర వంటి వివిధ ఉత్సవాలలో మహాప్రభువుకు నృత్య సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.


