మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియా జాంత్రీ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చి దిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కలెక్టర్ ప్రథమేశ్ అర్వింద్ ఆదేశాలతో జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి ఈ రోజు మంగళవారం జంత్రీ పంచాయతీలో ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో భీమభోయి దివ్యాంగ సామర్థ్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమం ద్వారా ప్రతి అర్హత గల లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించాలన్నారు. మొత్తం 154 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. వీరిలో 83 మందికి పెన్షన్లు మంజూరు చేశారు. 24 మంది దివ్యాంగులు, 13 మంది మానసిక వికలాంగులు, 12 మంది దృష్టిలోపం ఉన్న వారు 22 మంది చెవిటి, మూగ దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా భద్రతాధికారి నిర్మల్ ధారువా, డీఎంఓ డాక్టర్ నిహర్ రంజాన్ ప్రహరాజ్, చిత్రకొండ బీడీఓ ప్రీత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


