మల్కన్‌గిరి: జిల్లాలోని పంగం గ్రామం వద్ద బుధవారం రాత్రి గోవిందపల్లి నుంచి మల్కన్‌గిరికి వస్తున్న సమయంలో బైక్ అదుపుతప్పి పొలాల్లో పడిపోయి సంతోష్ కిర్సనీ (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సంతోష్ తెలిసినవారిని గోవిందపల్లిలో దించడం కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాద జరిగింది. చాలా సమయం తర్వాత అటుగా వచ్చిన గ్రామస్తులు చూసి వెంటనే గ్రామంలో వారికి తెలియజేశారు. మల్కన్‌గిరికి చెందిన యువకుడిగా గుర్తించి తండ్రి అర్జున్ కీర్సనీకు సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసు శాఖలో విధుల్లో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. మృతదేహన్ని మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సంతోష్ మృతితో మల్కన్‌గిరిలో విషదచాయలు అలుముకున్నాయి.


