భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి భవన సముదాయం విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ పనుల కోసం భువవనేశ్వర్ లోక్ సభ సభ్యురాలు అపరాజిత షడంగి ఎంపీ లాడ్ నుంచి నిధులను కేటాయించడంతో ఈ పనులు ప్రారంభించనున్నట్లు అధ్యక్షుడు గన్నవరపు ఆనంద్ రావు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో సమితి కార్యదర్శి రాయప్రోలు సత్య సాయి పాల్గొన్నారు. కార్యవర్గం ఆహ్వానం మేరకు ఎంపీ అపరాజిత షడంగి ప్రత్యక్షంగా సందర్శించి భవన సముదాయం విస్తరణకు నిధులు కేటాయించినట్లు ఏసీఏ కార్యవర్గ సభ్యురాలు డి.విజయ లక్ష్మి తెలిపారు.


