భువనేశ్వర్: బొలంగీర్ జిల్లా కంటాబంజి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆయూబ్ ఖాన్ మృతి చెందారు. ఆయన రాష్ట్ర శాసన సభకు తొలుత స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక అయ్యారు. 2004 నుంచి 2009 వరకు స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తర్వాత బిజూ జనతా దళ్‌లో చేరి 2014 నుంచి 2019 వరకు ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆయన మృతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, విపక్ష నేత నవీన పట్నాయక్, ఉప ముఖ్యమంత్రి కనక వర్ధన్ సింగ్‌దేవ్ తదితర ప్రముఖులు, రాజకీయ వేత్తలు సంతాపం ప్రకటించారు.


