నిందితులను అరెస్టు చేయండి | - | Sakshi
Sakshi News home page

నిందితులను అరెస్టు చేయండి

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

రాయగడ: ఈనెల 9వ తేదీ రాత్రి స్థానిక అంబేడ్కర్‌ నగర్‌ రెల్లివీధికి చెందిన హడప నిఖిల్‌ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. అయితే హత్య జరిగి ఆరు రోజులు పూర్తవుతున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఎటువంటి పురోగతిని సాధించలేదని నిరసిస్తూ మృతుని కుటుంబీకులు, బంధువులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ స్వాతి ఎస్‌.కుమార్‌, కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణిలను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. మరో 15 రోజుల్లో హత్యకు కారకులైన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి దుశ్చర్య ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికై నా నిందితులను అరెస్టు చేసి, తగిన శిక్ష వేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement