మేముసైతం! | - | Sakshi
Sakshi News home page

మేముసైతం!

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

మహిళా క్రికెట్‌లో.. మేముసైతం!

జట్టులో చోటే లక్ష్యంగా సాధన చేస్తున్న అమ్మాయిలు

తోడ్పాటునందిస్తున్న జిల్లా క్రికెట్‌ సంఘం

వేసవి క్రీడా శిక్షణా శిబిరాల వేదికగా సాధన

మెలకువలు నేర్పిస్తున్న మాజీ క్రికెటర్‌

ఇలియాస్‌, కోచ్‌లు

మహిళా క్రికెట్‌లో..

శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు జిల్లా గ్రామీణ క్రీడలకు పెట్టింది పేరు. ఇప్పుడు ఆ కోవలో అనేక క్రీడలతోపాటు క్రికెట్‌ కూడా వచ్చి చేరింది. రంజీతోపాటు ఐపీఎల్‌కు కూడా ఎంపికై న క్రీడాకారులు ఉన్నారు. జిల్లా క్రికెట్‌ సంఘం ప్రోత్సాహంతో క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో రాణిస్తున్నారు. భారత మహిళా క్రికెట్‌ జట్టు స్ఫూర్తితో జిల్లాలో మహిళా క్రికెట్‌పై మక్కువ పెంచుకుంటున్నారు బాలికలు. గత మూడేళ్లగా జిల్లాలో మహిళా క్రికెట్‌ క్రీడాకారిణులు రాణిస్తున్నారు.

‘సమ్మర్‌ క్యాంప్‌’లో సాధన..

ఈ కొత్త సీజన్‌లో ప్రతి ఒక్కరూ లక్ష్యాలను ఏర్పరచుకున్నారు. అందుకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలను వేదికగా ఎంచుకున్నారు. మహిళా క్రికెటర్ల సాధన కోసం శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఇటీవల ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఏర్పాటు చేసిన క్రికెట్‌ అకాడమీ కమ్‌ నెట్స్‌లో ఉదయం, సాయంత్రం కఠోర సాధన చేస్తున్నారు. బౌలింగ్‌, బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లో మహిళా క్రికెట్‌ కోచ్‌లు మెలకువలు నేర్పిస్తున్నారు. ఫిట్‌నెస్‌పై కూడా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు. జిల్లా క్రికెట్‌ సంఘం మెంటార్‌, సీనియర్‌ వెటరన్‌ ప్లేయర్‌ ఇలియాస్‌ మహ్మద్‌ ప్రతి ఆదివారం ప్రాక్టీస్‌ సెషన్‌కు హాజరవుతూ క్రీడాకారిణులను ప్రోత్సహిస్తున్నారు. వారు మరింత మెరుగుపడేలా సీనియర్‌ కోచ్‌లను తెప్పిస్తున్నారు. ప్రైమరీ పాఠశాలల్లో చదువుతున్న చదువుతున్న చిన్నారులు సైతం ప్రాక్టీసులకు హాజరవుతుండటం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement