భువనేశ్వర్: భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) జారీ చేసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 12వ తేదీ వరకు ఈ వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ సూచన. ఈ వ్యవధిలో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ పసుపు హెచ్చరిక జారీ చేసింది. మయూర్‌భంజ్, కెంజొహర్, సుందర్‌గడ్, నవరంగపూర్, కలహండి, కంధమల్, నువాపడా, సంబల్‌పూర్, ఝార్సుగుడ, దేవ్‌గడ్, బర్‌గడ్, అంగుల్, బాలాసోర్, అంగుల్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రాపడా, కటక్, జగత్‌సింగ్‌పూర్, పూరీ, ఖుర్దా, నయాగఢ్, ఢెంకనాల్, గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందస్తు సమాచారం జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలో మీటర్ల వరకు వేగం పుంజుకునే ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అంచనా. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ప్రజలు అప్రమత్తతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. ఉరుములతో కూడిన వర్షాలు సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రదేశాలలో పనిచేసే వర్గాలు ఎత్తైన చెట్లు, లోహ నిర్మాణాలకు దూరంగా ఉండాలని ఐఎండీ కోరింది.
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగం, మున్సిపల్ సంబంధితశాఖ అధికారులు బుధవారం పలు హోటళ్లల్లో ఆకస్మిక దాడులను నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా జరిమానా రూ పంలో రూ.58 వేలను వసూలు చేశారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి జ్యోతిప్రకాష్ సోరేన్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సంతోష్‌కుమార్ నాయక్ నేతృత్వంలో గుణుపూర్ పట్టణంలో గల వివిధ హోటళ్లలో దాడులను నిర్వహించారు. పాడైన ఆహా ర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగులు వినియోగించవద్దని హెచ్చరించారు. హోటళ్ల నిర్వహణకు సంబంధించిన అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహించే హో టళ్ల యజమానులపై చర్యలు తీసుకుంటామన్నా రు. హోటళ్లలో పాలిథిన్ వినియోగం, ట్రేడ్ లైసెన్స్ లేనివారిపై జరిమానాలు విధించారు. 14 హోటళ్ల లో అధికారులు దాడులను నిర్వహించి రూ.58 వేలు జరిమానా విధించారు.


