‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేయాలి’

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

జయపురం: మహిళా రిజర్వేషన్‌ బిల్లు వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తూ దివిటీలు, కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించింది. జయపురం సబ్‌డివిజన్‌ బొయిపరిగుడలో బుధవారం సాయంత్రం యూత్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. బొయిపరిగుడ సమితి అధ్యక్షుడు రామ ఖిలో నేతృత్వంలో నిర్వహించిన ర్యాలీ బీరకంభ పీఠం నుంచి సహిద్‌ లక్ష్మణ నాయిక్‌ జంక్షన్‌ వరకు సాగింది. ర్యాలీలో కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి శంకర ఉల్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళల సంరక్షణ బిల్లు 2023 పార్లమెంట్‌లో పాసైందని వెల్లడించారు. 33 శాతం రిజర్వేషన్‌తో పాసయిన బిల్లును కేంద్రం వెంటనే అమలు చేయాలన్నారు.

బీజేపీ ప్రభుత్వం మరోసారి కొత్త బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి దేశ మహిళలను పక్క దారి పట్టిస్తున్నారని నిందించారు. కార్యక్రమంలో కొరాపుట్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రూపక్‌ తురుక్‌, కొట్‌పాడ్‌ విధాన సభ కాంగ్రెస్‌ అభ్యర్థి అనమా దియాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement