● రూ.1,27,500 జరిమానా వసూలు
జయపురం: జయపురం పట్టణంలో శబ్ధ కాలుష్యం సృష్టిస్తున్న మోటారు బైక్‌ల సైలెన్సర్లను పట్టణ పోలీసులు ధ్వంసం చేశారు. కొరాపుట్ ఎస్పీ రోహిత్ వర్మ ఆదేశాల మేరకు శుక్రవారం జయపురం పట్టణం ప్రధాన కూడలి నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గంలో ద్విచక్రాల వాహనాలను, వాటి పత్రాలను తనిఖీ చేసినట్లు పోలీసు అధికారి అర్చన మిత్తల్ వెల్లడించారు. 85 మోటారు వెహికల్ కేసులు నమోదు చేసి, ఆయా వాహనాల డ్రైవర్ల నుంచి రూ.1,27,500 జరిమానా వసూలు చేసినట్లు తెలిపారు. పోలీసులు జప్తు చేసిన సైలెన్సర్లను రోలర్‌తో మట్టించి ధ్వంసం చేశామన్నారు. వాహనదారులు కొత్త సైలెన్సర్లు తెచ్చిన తరువాతనే వారికి వాహనాలు అప్పగించారు.
మావో లేఖ విడుదల
మల్కన్‌గిరి : కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఉత్తర సమన్వయ కమిటీ శుక్రవారం ఓ మావో లేఖను విడుదల చేశారు. ఈ లేఖ విడుదలతో చత్తీస్‌గఢ్ పోలీసులు, కేంద్ర భద్రత సంస్థలు హై అలర్ట్ జారీ చేశాయి. లేఖలో సంస్థ ప్రస్తుతం నేరుగా ఎదురుకాల్పుల్లో నివారిస్తూ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని చూస్తున్నట్లు కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. లేఖలో చత్తీస్‌గఢ్, తెలంగాణలో చురుగ్గా పనిచేసిన ప్రముఖ నక్సల్ నాయకుడు దేవ్‌జీ లొంగుబాటు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతడిని శత్రువుల ఏజెంట్‌గా అభివర్ణించారు. దేవ్‌జీ వంటి సీనియర్ నేతల లొంగుబాటు సంస్థకు పెద్ద దెబ్బగా మారింది. అందుకే లేఖ ద్వారా సంస్థ ముగిసిపోలేదనే సంకేతాన్ని పంపించారు.


