రాయగడ: యువత క్రీడలపై ఆసక్తి కనబరిచి ప్రతిభ చాటుకోవాలని బీజేపీ జిల్లా కార్యదర్శి కొరాడ రజిత అన్నారు. జిల్లాలోని కళ్యాణసింగుపూర్ సమితి సింగారి పంచాయతీ సనొబామునగుడలో సనొబామునగుడ క్రికెట్ టోర్నీ ఫైనల్స్‌లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. గుండురిగుడ, హతిముండ జట్ల మధ్య జరిగిన ఫైనల్ పోరులో గుండురిగుడ జట్టు విజేతగా నిలిచింది. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు రంజనా ఉపాధ్యాయ, టుటు ఖడంగ, కొరప పంచాయతీ బీజేపీ అధ్యక్షుడు వంశీధర్ పాత్రొ తదితరులు పాల్గొన్నారు.


