చిన్నారులను కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

చిన్నారులను కాపాడుకుందాం

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

చిన్నారులను కాపాడుకుందాం

పర్లాకిమిడి: బాలబాలికలు సులభంగా సైబర్‌ నేరాలు బారిన పడటం, సోషల్‌మీడియా మాయలో చిక్కుకుని క్రిమినల్స్‌ చేతిలో హ్యాక్‌కు గురికావడం, కిడ్నాప్‌, క్రైం వంటి కేసుల్లో ఇరుక్కోవడం కోవిడ్‌ 2019 నుంచి ఎక్కువైందని, ఇలాంటి వారిని సంరక్షించడానికి ‘జువెటికా’ అనే అవుట్‌రీచ్‌ కార్యక్రమం ప్రారంభించామని ఆదర్శ పోలీసు స్టేషన్‌ ఐఐసీ ప్రశాంత భూపతి అన్నారు. స్థానిక ఆదర్శపోలీసు ష్టేషన్‌లో జువెటికా అవుట్‌రీచ్‌ కార్యక్రమాన్ని ఒడిషా డి.జి.పి. భుభనేశ్వర్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించగా.. పర్లాకిమిడిలో జిల్లా ఎస్పీ (ఇన్‌చార్జి) సునీల్‌ కుమార్‌ మహాంతి ముఖ్య అతిథిగా హాజరై గజపతిలో ప్రారంభించారు. కార్యక్రమంలో డి.సి.పి.ఓ.అరుణ్‌ కుమార్‌ త్రిపాఠి, సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి మాధవానంద నాయక్‌, సఖీ వన్‌స్టాప్‌ సెంటర్‌, అంగన్‌వాడీ వర్కర్లు, వివిధ ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement