కొరాపుట్‌ టు పూరీ | - | Sakshi
Sakshi News home page

కొరాపుట్‌ టు పూరీ

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

కొరాపుట్‌: శబరి శ్రీ క్షేత్రం కొలువు తీరిన కొరాపుట్‌ నుంచి జగన్నాథుడు కొలువు తీరిన శ్రీ క్షేత్రానికి రైలు ప్రారంభం కానుంది. అందుకు తగ్గ ఆదేశాలు కేంద్ర రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ రైలు ఉదయం 5 గంటలకు కొరాపుట్‌లో బయలు దేరి రాయగడ, కెసింగా, సంబల్‌పూర్‌, భువనేశ్వర్‌, ఖుర్డా రోడ్డు మీదుగా రాత్రి 10.20 కి పూరి చేరనుంది. అలాగే ఉదయం 7 గంటలకు పూరి నుంచి బయల్దేరి 11.30 కి కొరాపుట్‌ చేరుతుంది. పగటి పూట రాజధానికి రైలు, పూరికి నేరుగా రైలు కావాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రైలు ఏర్పాటుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కొరాపుట్‌లో మంగళ వారం, శుక్రవారం, ఆది వారం, పూరిలో సోమ వారం, గురు వారం, శని వారం నడవనుంది. ఈ రైలు ఏర్పాటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి మెహన్‌ చరణ్‌ మఝి ఎక్స్‌ వేదిక హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ప్రకటించారు. మరో వైపు కాంగ్రేస్‌ పార్టీ కి చెందిన కొరాపుట్‌ ఎంపీ సప్తగిరి ఉల్క తాను అనేక సార్లు పార్లమెంట్‌ లో ఈ రైలు కోసం డిమాండ్‌ చేసిన విషయం గుర్తు చేశారు. బీజేపీకి చెందిన కొరాపుట్‌ ఎంఎల్‌ఎ రఘురాం మచ్చో మాట్లాడుతూ తాను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని శ్రీ వైష్టవ్‌ ప్రత్యేకం గా కలసి విజ్ఞప్తి చేయడం తో ఈ రైలు సాధ్యమైందని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement