రాయగడ: పార్లమెంట్‌లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అభియాన్‌కు మద్దతుగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సదరు సమితి పరిధిలోని జిమిడిపేటలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహిళా సాధికారతకు తమ మద్దతు ప్రకటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీల వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రజిత కొరాడ, ఆ పార్టీ నాయకురాలు అశ్విని కొంచాడ, ఎస్‌డీసీ వైస్ చైర్మన్ మంజుల మినియాక, జిల్లా ఎస్సీ, ఎస్టీ మోర్చా ఉపాధ్యాక్షుడు బసంత కుమార్ ఉలక, కెరడ సర్పంచ్ విజయలక్ష్మి, ప్రతాప్ పువ్వల పాల్గొన్నారు.


