ఆదివాసీ కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

రాయగడ: స్థానిక శక్తి సంస్థ ఆధ్వర్యంలో పలు ఆదివాసీ కుటుంబాలకు నిత్యావసరాలను శనివారం పంపిణీ చేశారు. స్థానిక కొత్తపేటలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాయగడ సమితి పరిధిలోని కూలిగుడ, తర్లాబడి గ్రామాలకు చెందిన 50 మంది ఆదివాసీ కుటుంబాలు పాల్గొన్నాయి. రాయగడ ఎంఎల్‌ఏ అప్పల స్వామి కడ్రక హాజరై వీరికి ఆహార ధాన్యాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శక్తి సంస్థ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు ఆదివాసీ కుటుంబాల అభ్యున్నతికి ఎంతో దోహదపడుతున్నాయన్నారు. సంస్థ డైరెక్టర్‌ రమేష్‌ చంద్ర నాయక్‌ మాట్లాడుతూ.. రాయగడ, రామనగుడ సమితుల్లో ప్రీ స్యూల్‌ విద్యలో భాగంగా 200 మంది చిన్నారులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారని వివరించారు. చిన్నారులకు రోజూ పాలు, బిస్కెట్లు, అందించడంతొ పాటు శీతాకాల దుస్తులు, సంవత్సరానికి మూడు జతల దుస్తులు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ప్రతీ కుటుంబానికి ఏడాదికి రెండు సార్లు బియ్యం, పప్పుదినుసులు అందిస్తూ పిల్లలకు ప్రాధమిక విద్యను అందిస్తున్నట్టు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement