‘అత్యాచారాలు అరికట్టాలి’ | - | Sakshi
Sakshi News home page

‘అత్యాచారాలు అరికట్టాలి’

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

జయపురం: రాష్ట్రంలో మహిళల భద్రత, రక్షణ, సమాజంలో సమానత, 33 శాతం రిజర్వేషన్లు తదితర డిమాండ్లతో ఆదివారం జయపురంలో బీజేడీ మహిళా విభాగం వారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి రబినారాయణ నందో సతీమణి కొరాపుట్‌ కేంద్ర సహకార బ్యాంక్‌ మాజీ అధ్యక్షురాలు ఇందిర నందో నేతృత్వంలో వందలాది మంది మహిళా కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్న మహిళా అధికార్‌ అభిజాన్‌ ర్యాలీ రాజనగర్‌ కూడలి నుంచి బయలు దేరి పట్టణంలో పలు వీధుల్లో మీదుగా పంచానన మందిర ప్రాంతానికి చేరుకుంది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పలువురు మహిళా నేతలు జిల్లా మహిళా బీజేడీ అధ్యక్షురాలు పార్వతీ మస్తి, ఉపాధ్యక్షురాలు లిలి బురుడితోపాటు మాజీ మంత్రి రబినారాయణ నందో, కొరాపుట్‌ జిల్లా బీజేడీ కార్యనిర్వాహక అధ్యక్షులు దుర్గా ప్రసాద్‌ మిశ్ర, కొరాపుట్‌ జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షులు రాధా బినోద్‌ సామంతరాయ్‌, జిల్లా బీజేడీ ఉపాధ్యక్షులు నాగరాజు దొర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement