‘మహిళా భద్రతకు చర్యలు చేపట్టాలి’ | - | Sakshi
Sakshi News home page

‘మహిళా భద్రతకు చర్యలు చేపట్టాలి’

May 16 2026 3:01 AM | Updated on May 16 2026 3:01 AM

‘మహిళా భద్రతకు చర్యలు చేపట్టాలి’

జయపురం: రాష్ట్రంలో డబల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చి న మహిళలపై అత్యాచారాలు, వేధింపులు ఎక్కువ అయ్యాయని మాజీ మంత్రి రబినారాయణ నందో అన్నారు. జయపురం సబ్‌డివిజన్‌ కొట్‌పాడ్‌లో బీజేడీ నిర్వహించిన నారీ అధికార్‌ అభిజాన్‌క్‌ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. వందలాది మంది బీజేడీ మహిళా కార్యకర్తలు, పార్టీ కార్యకర్త లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేక నినాదాలు గల ప్లకార్డులు, బీజేడీ పతాకాలతో మాజీ మంత్రి పద్మిణీ దియాన్‌ నేతృత్వంలో భారీ ర్యలీ నిర్వహించారు. అనంతరం కొట్‌పాడ్‌ బిజూపట్నాయక్‌ రీడింగ్‌ కేంద్రంలో మాజీ మంత్రి పద్మిణీ దాయాన్‌ అధ్యక్షతన జరిగిన సభలో మాజీ మంత్రి రబినారాయణ నందో ప్రసంగించారు. బీజేడీ పాలనపై నిప్పులు చెరిగారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లు అమలు చేయటంలో బీజేపీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో ధరలు చుక్కలనంటుతున్నాయని, సామాన్య ప్రజల జీవణం దుర్భరమైందని అన్నా రు. రైతులకు గిట్టుబాటు ధర లభించటం లేదని ఆరోపించారు. మహిళల సమస్యలతో పాటు, రైతు ల, ప్రజల సమస్యలపై బీజేడీ పోరాటం చేస్తాదని రబినారాయణ నందో హెచ్చరించారు. మాజీ మంత్రి ఛపద్మిణీ దియాన్‌, మాజీ ఎమ్మెల్యే చంధ్ర శేఖర మఝి, కొరాపుట్‌ జిల్లా మహిళా బీజేడీ అధ్యక్షురా లు పార్వతీ మస్తి, జిల్లా పరిషత్‌ సభ్యులు గీత మ ఝి, కొట్‌పాడ్‌ సమితి ఉపాధ్యక్షులు తపన్‌ కుమార్‌ పాణిగ్రహి, కొరాపుట్‌ కేంధ్ర సహకార బ్యాంక్‌ ఉపాధ్యక్షులు డి.భొత్ర, జిల్లా నాణి పంచాయతీ అధ్యక్షు లు భీరెన్‌ బిశాయ్‌, మహమ్మద్‌ సాలిమ్‌, శ్రీకాంత పండ, ప్రశాంత పట్నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement