కంచిలి: గొల్లకంచిలి వద్ద 100 ప్యాకెట్ల సారాతో ఇద్దరు వ్యక్తులను సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి. రమణ శనివారం అరెస్టు చేశారు. వీరి నుంచి సరకుతోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ముద్దాయిలుగా ఉన్న బురదపాడు గ్రామానికి చెందిన గేదెల మోహనరావు, గొల్లకంచిలికి చెందిన దుబ్బ ధర్మారావులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో వీరు నాటుసారా ప్యాకెట్లను ద్విచక్ర వాహనంపై తీసుకొస్తుండగా ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై గతంలో కూడా పలు కేసులు ఉండటంతో, సోంపేట కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ జగన్నాథ్, సిబ్బంది భానుప్రసాద్, ఉమాపతి, మార్కారావు పాల్గొన్నారు.
బొలెరో వ్యాన్ బోల్తా
ఎచ్చెర్ల: ఫరీదుపేట పంచాయతీ పరిధిలోని కోయిరాళ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం బొలెరో వ్యాన్ బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వాటర్ బాటిళ్లతో వస్తున్న వ్యాన్ కొయిరాళ్ల జంక్షన్ వద్దకు వచ్చేసరికి టైరు పేలి బోల్తాపడింది. ఆ సమయంలో అటుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెట్రోలింగ్ పోలీసులు, ఎన్‌హెచ్‌ఎఐ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని జాతీయ రహదారిపై వాహనాలు మళ్లించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


