విపక్షాలపై బీజేపీ వర్గీయుల మండిపాటు | - | Sakshi
Sakshi News home page

విపక్షాలపై బీజేపీ వర్గీయుల మండిపాటు

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

జయపురం:పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన మహిళా శక్తి బిల్లును ప్రతి పక్షాలు వ్యతిరేకించటాన్ని నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా జయపురంలో ఆగ్రహ సభ, పాదయాత్ర నిర్వహించారు. నేడు జయపురంలో బీజేపీ వర్గాలు విపక్షాల చర్యకు నిరసన తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి సాయంత్రం స్థానిక రఘునాథ్‌ మందిర కూడలి నుంచి శోభాజాత్రగా బయలు దేరి పట్టణంలో వీధిలలో తిరిగారు. ఈ సందర్బంగా వారు కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయిక్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శోభా జాత్ర జయపురం 26 వ జాతీయ రహదారి కూడలి వద్దకు వచ్చి అక్కడ బహిరంగ సభ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement