మోసాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

మోసాలపై అవగాహన

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

మోసాలపై అవగాహన

రాయగడ: జిల్లాలోని 16 పోలీస్‌ స్టేషన్లలో జువెన్‌టిక అవుట్‌రీచ్‌ విత్‌ అడాల్సెంట్‌ కార్యక్రమాలు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగాయి. యువతీ, యువకులను ఆహ్వానించి వారికి ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. డిజిటల్‌ మాధ్యమంలో యువత వివిధ మోసాలకు గురవుతున్న నేపథ్యంలో వారికి జరిగిన మోసాలకు సంబంధించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లేందుకు సంకోచించడం వల్ల తరచూ మోసాల బారిన పడుతున్నారు. అందువల్ల వారు పోలీసులకు సంప్రదించడంతో పాటు వారికి జరిగిన మోసాలకు సంబంధించి ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకువెళితే తగిన న్యాయం చేకూరుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పోలీస్‌ విభాగం నిర్వహించింది. శుక్రవారం నాడు జిల్లాలో జరిగిన వివిధ పోలీస్‌ స్టేషన్లలో యువతీ, యువకులను ఆహ్వానించిన పోలీసులు ఈ మేరకు వారిని చైతన్య పరిచారు.

Advertisement
 
Advertisement
Advertisement