రాయగడ: క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం ట్రోఫీ–2026 ఒడిశా క్రీడా మహాకుంభం అంతర జిల్లా స్థాయి క్రీడా పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక హాజరయ్యారు. ప్రతిభలు అనేకం–లక్ష్యం ఒక్కటే అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. క్రీడా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధను ప్రశంసించారు.
క్రీడాకారులను ప్రోత్సాహించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అభివృద్ధి మండలి (ఎస్‌డిసి) చైర్మన్ విద్యాధర్ సబర్, వైస్ చైర్‌పర్సన్ మంజుల మినియాక, జిల్లా అదనపు కలక్టర్ నవీన్ చంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్ మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఈ పోటీలు 20వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు.


