రాయగడలో జనాగ్రహ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

రాయగడలో జనాగ్రహ ర్యాలీ

May 18 2026 9:43 AM | Updated on May 18 2026 9:43 AM

తరలివచ్చిన బీజేపీ మహిళా శ్రేణులు

రాయగడ: మహిళల వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మహిళా జనాగ్రహయాత్రను రాయగడలో ఆదివారం నిర్వహించారు. మహిళల హక్కులు, సంక్షేమం, సాధికారత అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ర్యాలీ చేశారు. రాయగడ నగర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో అధికసంఖ్యలో మహిళలు భాగస్వాములయ్యారు. స్థానిక జ్యోతిమహాల్‌ కూడలి నుంచి కపిలాస్‌ కూడలి వరకు భారీ ర్యాలీ, పాదయాత్రను చేపట్టారు. మహిళల ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌, బీజేడీ, ఇతర పార్టీలు వ్యవహరిస్తున్నాయని నినాదాలు చేశారు. కార్యకరమంలో జిల్లా అధ్యక్షుడు టి.గొపిఆనంద్‌, పట్టణ అధ్యక్షుడు రాజేష్‌ కుమార్‌ పాణిగ్రహి, నగర మహిళా మోర్చా అధ్యక్షురాలు రచన సాహు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రజిత కొరడ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement