జయపురం:
మన ప్రాచీన కళలు, సంస్కృతిలు మన గుర్తింపుకు ప్రతీకలని చత్తీస్‌గఢ్ రాష్ట్ర బస్తర్ పార్లమెంట్ సభ్యులు మహేష్ కాశ్యప్ అన్నారు. నేడు శ్రీశబరి శ్రీక్షేత్ర కళాసంస్కృతి కొట్‌పాడ్ సమితి కొట్‌పాడ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి ఆర్ట్, కల్చరల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మన కళలు, సంస్కృతులు మన గుర్తింపుకు కవచాలని, వాటిని పరిరక్షించటంతో పాటు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొట్‌పాడ్ ప్రాంత రిచ్ ట్రెడిషనల్ ఆర్ట్‌ను జానపద సంప్రదాయం ఆదివాసీ హెరిటేజ్ మరింతగా బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించటం జరిగిందని శ్రీశబరి శ్రీక్షేత్ర కళా సంస్కృతి నిర్వాహకులు వెల్లడించారు. భవిష్యత్‌లో ఆర్ట్ కల్చరల్ సమావేశాలు విస్తృతంగా నిర్వహించి ప్రాచీన కళా సంస్కృతిను సాంప్రదాయాలను బలోపేతం చేయాలని కోట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భోత్ర విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కొట్‌పాటడ్ సమితి అనేక గ్రామాల నుంచి ఆదివాసీ ప్రజలు తమ సంప్రదాయ కళలతో పాల్గొన్నారు.


