మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బంధగూడ గ్రామం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, ఆయన కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.మాత్తిలి సమితి దుంగియాపూట్ పంచాయతీలో గ్రీవెన్స్‌కు హాజరవుతున్న సమయంలో భంజనగార్ నుంచి కలిమెల వస్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. వ్యవసాయశాఖ జిల్లా అధికారి అనిల్‌కుమార్ ప్రహరాజ్‌కు స్వల్ప గాయాలు, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతు న్నారు.


